అవును క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఓ అక్రమ కట్టడంలో ఉండటమే కాకుండా దాన్ని సక్రమం చేయమని ప్రభుత్వానికి లేఖ రాసిన చంద్రబాబును వైసిపి నేతలు నాలుగు వైపులా చేరి వాయించేస్తున్నారు. అక్రమ కట్టడాల్ని కూల్చేయాల్సిన చంద్రబాబు తానే ఓ అక్రమ కట్టడాన్ని క్యాంపు ఆఫీసుగా మార్చుకోవటంతో తన స్ధాయిని తానే దిగజార్చేసుకున్నారు.

 

2014లో అధికారంలోకి రాగానే కరకట్టపై ఎన్నో అక్రమ కట్టడాల్ని చంద్రబాబు ప్రభుత్వం గుర్తించి కూల్చేయటానికి నిర్ణయించింది. ఆ భవనాలకు నోటీసులు కూడా అంటించేసింది. అయితే వాటిల్లోని ఓ అక్రమభవనంపై చంద్రబాబు మనసుపడటంతో సీన్ మొత్తం మారిపోయింది.

 

తాను ఓ అక్రమకట్టడంలో ఉండటమే కాకుండా ప్రభుత్వంతోనే మరో అక్రమకట్టడాన్ని నిర్మింపచేసిన ఘనత చంద్రబాబు సొంతం చేసుకున్నారు. సరే అదంతా చరిత్ర అనుకోండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చంద్రబాబు ఓ లేఖ రాసారు. తానుంటున్న అక్రమ కట్టడంలోనే తాను కంటిన్యు అవనున్నట్లు చెప్పారు.

 

పైగా పక్కనే నిర్మించిన మరో అక్రమకట్టడం ప్రజావేదికను కూడా తనకే కేటాయించాలంటూ నిశిగ్గుగా అడిగారు. పైగా దాని అద్దెను కూడా ప్రభుత్వమే చెల్లించాలంటూ కోరటమే విచిత్రంగా ఉంది. అప్పటి నుండి వైసిపి నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు ఎలాగైనా సరే భవనాన్ని ఖాళీ చేయిస్తామని మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పటికే అల్టిమేటమ్ ఇచ్చారు.

 

తాజాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నదులు, ప్రకృతి సంపదలు చంద్రబాబుకు సొంత ఆస్తుల్లా కనబడతాయని ఎద్దేవా చేశారు. అందుకే కృష్ణా నదిని పూడ్చి కట్టిన భవనంలో చంద్రబాబు నిసిగ్గుగా ఉంటున్నారంటూ మండిపడ్డారు. ఏమాత్రం సామాజిక బాధ్యతున్నా చంద్రబాబు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలంటూ హెచ్చరించారు. వీళ్ళిద్దరే కాకుండా చాలామంది వైసిపి నేతలు చంద్రబాబును వాయించేస్తున్నా ఇంకా చూరుపట్టుకునే చంద్రబాబు వేలాడుతుండటం ఆశ్చర్యంగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: