2009 లో జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను ప్రచారం కోసం వినియోగించుకున్నారు.  ఈ ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల పర్యటించారు.  తన మార్క్ ప్రసంగాలతో ఆకట్టుకున్నాడు.  ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్నారు అనే సరికి జనాలు విపరీతంగా వచ్చారు.  


ప్రసంగాలు విన్నారు.  ఓటు మాత్రం వైఎస్ఆర్ కు వేశారు.  ఆ తరువాత బాబు.. ఎన్టీఆర్ ను దూరంగా పెట్టారు.  రాజకీయాలకు దూరంగా పెట్టడమే కాకుండా.. అటు హరికృష్ణను సైతం పెద్దగా పట్టించుకోలేదు.  దీంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ టీడీపీకి దూరం అయ్యింది.  2019 ఎన్నికల సమయంల టిడిపి ఘోరంగా ఓడిపోయింది.  టిడిపి బాధ్యతలు ఎన్టీఆర్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.  


టిడిపి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.  రాజకీయాలకు దూరంగా ఉన్నాకూడా, ఎన్టీఆర్ టిడిపి మనిషే.  అయితే, ఇప్పుడు వైకాపా.. ఎన్టీఆర్ కు గాలం వేస్తున్నది.  ఆంధ్రప్రదేశ్ కు ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా ఎన్టీఆర్ పారిశ్రామిక, వ్యవసాయ లేదా పర్యాటక రంగాలకు సంబంధించిన వాటిల్లో ఒకదానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని చూస్తోంది.  


వైకాపా పార్టీ తరపున అయితే ఎన్టీఆర్ ఒప్పుకోడు కాబట్టి, పార్టీ తరపున కాకుండా, రాష్ట్రం అభివృద్ధి కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని, దానికి ఎన్టీఆర్ ను ఒప్పించే బాధ్యతను కొడాలి నానిపై పెట్టింది.  ఎన్టీఆర్ కు కొడాలి నాని అత్యంత సన్నిహితుడు.  అంతేకాదు, ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైకాపాలో ఉన్నారు.  సో, ఎన్టీఆర్ ను ఒప్పించే బాధ్యత వీళ్లపై పెట్టాడన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: