గరుడ శివాజీ గారు పోలీసులకు చిక్కకుండా ఇంకా ఎక్కడున్నాడో ఆచూకి ఇంకా తెలియడం లేదు. కొంతకాలం క్రితం రవి ప్రకాష్ స్వయంగా పోలీసుల వద్ద లొంగిపోయారు. పలుమార్లు విచారణకు హాజరయ్యారు. కానీ గరుడ శివాజీ ఆచూకీ మాత్రం కనిపించలేదు. మధ్యలో ఒకసారి నేనెక్కడికి వెళ్లాను- వడ దెబ్బ తగిలి ఇంట్లో ఉన్నాను అంటూ తేలేసిన తన కళ్లను కూడా చూపించినా ఇప్పటికీ బయటకు రాలేదు.


ఇంతలో తాజాగా కొత్త అవతారంలో అతను ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాడు. చార్లీచాప్లిన్ ఆహార్యంతో మీసాలు చిన్నగా ట్రిమ్ చేసుకుని కనిపించే వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అయితే దానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. మరి ఇలా అజ్జాతంలో ఉండిపోవడమేనా? బయటకు వచ్చేదేమైనా ఉందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


మరి తన మిత్రుడు రవి ప్రకాష్ పై కోర్టులో బెయిలు గురించి వాదనలు ముగిశాయి. దాని ఫలితాన్ని బయట్టి అయినా శివాజీ ఏమైనా నిర్ణయం తీసుకుంటాడేమో చూడాలి. అయినా వడదెబ్బ తగ్గడానికి ఇన్ని రోజులు పడుతుందా? ఇది వైద్య వింత అంటూ సెటైర్లు పడుతున్నాయి శివాజీ మీద. సరే ఇవన్నీ పక్కన పెడితే అతని కొత్త అవతారం మాత్రం ఫన్నీగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: