జగన్ .. కడప బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్ చల్ చేస్తుంది. ఎప్పుడో రెండు వేల సంవత్సరం అప్పుడు జగన్ మోహన్ రెడ్డి బాలకృష్ణ తరఫున పత్రికా ప్రకటన ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్టుగా ఉంది ఆ పోస్టు. అయితే అది ఫేక్ అని కనిపెట్టడం కష్టం ఏమీ కాదు.అందులో వాడిన బాలకృష్ణ స్టిల్ అయితే సమర సింహారెడ్డిదే వాడారు కానీ - జగన్ మోహన్ రెడ్డి ఫొటోనే కొంచెం లేటెస్టుది వాడారు.


వాస్తానికి ఆ ఫొటోలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే లేరు. ఆ అసలు పిక్ లో భార్య భారతి కూడా ఉంటారు. ఆ ఫొటో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాకా తీయించుకున్నది లాగా ఉంది. ఆ ఫొటో జగన్ కు పెళ్లయ్యాకా - ఏ పదిహేనేళ్ల కిందటో తీయించుకున్న ఫొటోలోగా ఉండగా - దాన్ని కట్ చేసి - ఎడిట్ చేసి - పేపర్లో అచ్చు అయినట్టుగా పేస్ట్ చేశారు.


అయినా జగన్ మోహన్ రెడ్డి అలాంటి పత్రికా ప్రకటనలు ఇచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇన్నాళ్లూ వాటిని ఉపయోగించుకోకుండా ఖాళీగా ఉండే వాళ్లు కాదు. జగన్ కు సంబంధించి వాళ్లు గత ఐదేళ్లలో  ఎక్కడ చిక్కుతాడా అని చాలా రీసెర్చే చేశారు. ఇలాంటివి ఉంటే అప్పుడే చాలా రచ్చ చేసే వాళ్లు. అయినా ముఖ్యమంత్రి ఫొటోలతో ఫేక్ పోస్టులు క్రియేట్ చేసే ముందు పచ్చ బ్యాచ్ కాస్త ఆలోచించుకుంటే మేలేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: