నైరుతి రుతుపవనాలు దక్షిణాది రాష్ర్టాలకు విస్తరించడానికి ఉన్న అడ్డంకులు క్రమంగా తొలిగిపోతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 
కొన్నాళ్లుగా బీహార్, విదర్భ, తెలంగాణ, దక్షిణ తమిళనాడులో కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తుండటం రుతుపవనాల విస్తరణకు అడ్డుగా ఉన్నాయని పేర్కొన్నది. 
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పరిస్థితులు మారుతున్నాయని, రుతుపవనాల పురోగతికి కావాల్సిన వాతావరణం ఏర్పడుతున్నదని పేర్కొన్నది. 


అయితే ఇటీవల వచ్చిన వాయు తుఫాన్ కారణంగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో వాతావరణం చల్లబడుతున్నదని, అక్కడక్కడా మంచి వర్షాలు పడ్డాయని అధికారులు తెలిపారు.  వచ్చేవారం బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని, దీంతో వడగాడ్పులు తగ్గొచ్చన్నారు. మొత్తంగా రుతుపవనాలు ఈ వారాంతానికి కర్ణాకట, తమిళనాడులోని మరిన్ని ప్రాంతాలు, దక్షిణ కొంకన్, గోవా, బెంగాల్, ఏపీ, సిక్కిం, ఒడిశా రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందని అంచనావేస్తున్నారు.


ఈ నెల 22న కర్ణాటకలోని తీర, దక్షిణ అంతర్భాగ ప్రాంతాలు, కేరళలోని మహె ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువొచ్చని, ఛత్తీస్‌గఢ్, కొంకన్, గోవా, ఏపీ తీరం, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్నిచోట్ల భారీవర్షాలు కురువొచ్చని అంచ నా వేశారు. 23 నుంచి మూడు రోజులపాటు దక్షిణాదితోపాటు అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ర్టాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: