కెసిఆర్ తెరాస పార్టీని స్థాపించినప్పటినుంచి, ఆ పార్టీలో కీలక వ్యక్తిగా పనిచేసిన వ్యక్తి హరీష్ రావు.  పార్టీని ఎవదలకుండా.. ప్రతి పల్లెలో పార్టీని ప్రచారం చేశారు.  సంస్థాగతంగా బలపడే విధంగా చేశారు.  ఈరోజు పార్టీ ఈస్థాయిలో బలంగా ఉన్నది అంటే దానికి ప్రధాన కారణం హరీష్ రావు అనే చెప్పాలి.  


నీటి పారుదల వ్యవస్థపై మంచి అనుభవం ఉంది.  చెరువుల పునరుద్ధరణ కార్యక్రంలో ఎన్నో చెరువులను తవ్వించారు.  జాలసిరిని తెలంగాణకు తీసుకొచ్చే విధంగా చేయడంలో హరీష్ రావు ముందు వరసలో ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.  


గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన హరీష్ రావును ఇప్పటి ప్రభుత్వం పక్కన పెట్టింది.  పక్కన పెట్టడమే కాదు...  ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయంలోనూ హరీష్ రావును పిలవడం లేదు.  దీంతో హరీష్ రావు కూడా కొంతవరకు అసహంతో ఉన్నారని సమాచారం. 


ఈనెల 21 వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతున్నది.  ఈ కార్యక్రమానికి హరీష్ రావును పిలవలేదని సమాచారం.  హరీష్ రావును ఎందుకు పక్కన పెడుతున్నారో అర్ధంకానీ వ్యవహారంగా మారింది.  కేటీఆర్ ను తెరపైకి తీసుకొచ్చేనందుకు హరీష్ రావును పక్కన పెడుతున్నారా అన్నది సందేహం.  


మరింత సమాచారం తెలుసుకోండి: