భూమా కుటుంబానికి ఆళ్లగడ్డలో మంచి పేరు ఉన్నది.  శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి లు ఉన్నప్పుడు  వాళ్లకు ఆ ఏరియాలో తిరుగులేదు.  రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న కుటుంబం.  ఎప్పుడైతే శోభా నాగిరెడ్డి కారుప్రమాదంలో మరణించిందో అప్పటి నుంచి ఆ కుటుంబానికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయి.  


2014 ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియా వైకాపా తరపున పోటీ చేసి విజయం సాధించింది. అనంతరం టిడిపి ఆకర్షణకు లోనయ్యి ఆ పార్టీలో చేరిపోయింది.  మంత్రిగా పనిచేసింది.  ఇదే సమయంలో నాగి రెడ్డి మరణించడంతో ఆమె తమ్ముడిని ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించుకుంది.  


కానీ, ఇప్పుడు ఆ పరిస్థితిలేదు.  ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియా ఘోరంగా ఓడిపోయింది.  గంగుల కుటుంబానికి చెందిన బిజేంద్ర రెడ్డి అఖిల ప్రియను ఓడించాడు.  అన్నమాట ప్రకారం వైఎస్ జగన్ గంగుల కుటుంబానికి చెందిన ప్రభాకర్ రెడ్డికి శాసనమండలిలో ప్రభుత్వ విప్ పదవిని ఇచ్చింది.  


ఇది అఖిల ప్రియకు పెద్ద నష్టమని చెప్పాలి.  ఆళ్లగడ్డలో ఇప్పటి వరకు భూమా కుటుంబానికి ఆధిపత్యంగా ఉండేది.  ఇప్పుడు గంగుల కుటుంబం ఆధిపత్యం చెలాయించే విధంగా కనిపిస్తోంది.  బహుశా అందుకే అఖిల ప్రియా తిరిగి వైకాపాలో చేరేందుకు మార్గాలు అన్వేషిస్తోందని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: