మొత్తానికి తిరుమల తిరపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన దగ్గర నుండి టిటిడి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రాజీనామా వ్యవహారం పెద్ద సమస్యగా మారిపోయింది. ఛైర్మన్ గా రాజీనామా చేసేది లేదని పుట్టా  తెగేసి చెప్పిన కారణంగానే విషయం వివాదాస్పదమైంది.

 

ఛైర్మన్ గా రాజీనామా చేసే విషయం సెంటిమెంటుతో కూడిన విషయం కాబట్టే సెంటిమెంటు ప్రకారం తాను రాజీనామా చేయనంటూ భీష్మంచుకుని కూర్చున్నారు. పుట్టాను తొలగించేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను చూస్తోంది. ఆర్డినెన్సు ద్వారా తొలగించాలని అనుకున్నా లీగల్ సమస్యలు వస్తాయని చెప్పటంతో ఆ పద్దతికి ప్రభుత్వం స్వస్ధిచెప్పింది.

 

నిజానికి పుట్టా రాజీనామా చేయటమన్నది నైతిక విషయం. ప్రభుత్వాలు మారినపుడు పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయటమన్నది సహజంగా జరిగిదే. కానీ పుట్టా మాత్రం అడ్డం తిరిగారు.  సరే తెరవెనుక ఏం జరిగిందో ఏమో కానీ హఠాత్తుగా ఈరోజు తన రాజీనామా పత్రాన్ని టిటిడి ఈవో అనీల్ కుమార్ సింఘాల్ కు పంపటంతో ప్రభుత్వం పెద్ద సమస్య నుండి బయటపడింది. చూడబోతే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఛైర్మన్ నియామకానికి లైన్ క్లియర్ అయినట్లే ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: