ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవడంలో కెసిఆర్ ముందు ఉంటారు. ఆయన తీసుకునే నిర్ణయాలు సక్రమంగా ఉంటాయి.  ఒకసారి వాటిని అమలు చేయడం మొదలుపెడితే.. ఆ నిర్ణయాలతో ఎన్ని అద్భుతాలైనా సృష్టించవచ్చు అనే నానుడి ఉన్నది.  


కానీ, ఇప్పుడు కెసిఆర్ తీసుకునే నిర్ణయాలు అందరిని అయోమయంలో పడేస్తున్నాయి.  తెలంగాణాలో శాసనసభా, సచివాలయంలను కొత్తగా నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడుకెసిఆర్.  ఇప్పటికే ఈ రెండు తెలంగాణకు ఉన్నాయి.  ఇప్పుడు కొత్తగా మరలా ఇవి ఎందుకో అర్ధం కావడం లేదు. 


అసెంబ్లీ భవనాన్ని ఎర్రమంజిల్ లోను, సచివాలయాన్ని ఇప్పుడు ఉన్నచోటే పాతది కూల్చి దాని ప్లేస్ లో కొత్తగా నిర్మించాలని అనుకుంటున్నారు.  మొదట ఎర్రగడ్డలో సచివాలయం నిర్మించాలని అనుకున్నారు.  కేంద్రప్రభుత్వం అధీనంలో ఉన్న భూమిని తెచ్చుకున్నారు. 


భూమి పూజా చేద్దామని అనుకున్న సమయంలో రిజల్ట్ వచ్చాయి.  అటు కేంద్రంలో మోడీ తిరిగి అధికారంలోకి వచ్చారు.  ఇటు రాష్ట్రంలో కెసిఆర్ ప్రభంజనం తగ్గిపోయింది.  16 స్థానాలు గెలుస్తామని అనుకుంటే కేవలం 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  ఆ స్థలం కలిసి రాదనీ భావించి తిరిగి కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: