ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరుగుతున్నది.  ఈ అఖిలపక్ష సమావేశంలో కొన్ని కీలకమైన విషయాల గురించి చర్చించబోతున్నారు.  ప్రధానంగా జెమిలి ఎన్నికలు, మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాలు.  వీటిపై ఈరోజు పార్లమెంట్ సెంట్రల్ హాలులో చర్చించబోతున్నారు.  


ఈ అఖిలపక్ష భేటీకి పార్లమెంట్ లోని అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించారు.  ఈ భేటీకి కెసిఆర్ హాజరు కాకుండా తన తరపున తన కుమారుడు కేటీఆర్ ను పంపించారు.  అటు చంద్రబాబు కూడా హాజరు కావడం లేదు.   మమతా బెనర్జీ సరే సరి.  స్టాలిన్ కూడా హాజరు కావడం లేదని సమాచారం.  


మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా హాజరు కాకపోవడం శోచనీయం.  మహాత్మాగాంధీని తమ వాడిగా కాంగ్రెస్ పార్టీ ఫీలవుతుంది.  అలాంటి కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ 150 వ జయంతోత్సవాలను ఎలా నిర్వహించాలి అనే దానిపై సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. దానికి రాకపోవడం ఎలా.  


ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ ఢిల్లీ వెళ్లి ఆ భేటీలో పాల్గొంటున్నాడు.  ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నినాదానికి జగన్ మద్దతు పలుకుతాడా లేదా అన్నది చూడాలి.  ఇక మహాత్మాగాంధీ 150 వ జయంతోత్సవాలు నిర్వహించే విషయంపై జగన్ ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: