వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ఇవాళ ఢిల్లీలో అన్ని పార్టీల అధ్యక్షులతో పార్లమెంట్ లో సమావేశమ య్యారు ప్రధాని నరేంద్రమోడీ. 


ఈ సమావేశంలో అఖిలపక్ష హాజరైన తెలంగాణ రాష్ట్ర సమితి  వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, బీహార్ సీఎం నితీష్ కుమార్,  ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి , లోక్ జనశక్తి అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ , అకాలీదళ్ అధినేత సుక్ బీర్ సింగ్ బాదల్,  పీడిపి అధినేత్రి మెహబూబా మూర్తి , సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, సిపిఎం ప్రధాన ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి , ఎన్సీపీ అధినేత శరద్పవార్, రాందాస్ అథవాలే  ఇతర పార్టీల నేతలు కేంద్రమంత్రులు.. హాజరయ్యారు. 


వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఈ సమావేశానికి హాజరుకాలేదు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు బదులుగా.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మీటింగ్ కు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: