ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గరనుండి  తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.  పైగా మొన్న  అసెంబ్లీలో  నలభై ఏళ్ల అనుభవానికి చుక్కలు చూపించాడు. 2019 ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో  టీడీపీ చిత్తు చేసి ఓడించిన జగన్.. వచ్చే 2024 ఎన్నికల్లో కూడా  టీడీపీకి కోలుకునిచ్చేలా లేడు. వినూత్నమైన ఆలోచనలతో..  గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకుని నిర్ణయాలను  తీసుకుంటూ.. పరిపాలనలో తనధైన ముద్రను వేసుకుంటూ పోతున్నాడు. 

అయితే మొత్తానికి  టీడీపీ పార్టీ భవిష్యత్తుకి ఆశా కిరణం మాత్రం కనిపించట్లేదు. నారా లోకేష్  ఉన్నా.. ఉపయోగపడని పరిస్థితి. ఎటూ పప్పుగా ఎలివేట్ అయిన లోకేష్ ను ప్రజలు కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు.  మరో పక్క చంద్రబాబుకు వయసు పెరిగిపోవడంతో పార్టీ బాధ్యతలను జూనియర్ ఎన్‌టీఆర్‌ కు అప్పచెప్పాలని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడని..  ఏపీకి ఆదాయాన్ని అందించే వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటకం శాఖలకు  అంబాసీడర్‌ లను నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని..  వీటిల్లో ఓ శాఖకు జూనియర్ ఎన్టీఆర్ ను నియమించాలనే ఆలోచనలో ఉన్నారని..  నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. 

 

అయితే  ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం  మంత్రి కొడాలి నాని, తారక్ మామ నార్నే శ్రీనివాస్ లే అని సమాచారం. తారక్ ను ఏపీలో ఎలివేట్ చెయ్యాలనే ఉద్దేశ్యంలో వాళ్ళు ఉన్నారట. అందుకే జూనియర్ ఎన్‌టీఆర్ కు  ముందు ప్రభుత్వ పరంగా పూర్తి మద్దతు లంభించేలా చేసి.. ఆ తరువాత చంద్రబాబు నుండి టీడీపీని  లాక్కొచ్చి తారక్ చేతిలో పెట్టాలని  అందుకు ఇప్పటినుండే తారక్ ను సిద్ధం చెయ్యాలని వాళ్ళు ప్లాన్ లో ఉన్నారట. 


మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు  గాని, ఒక్కటి మాత్రం వాస్తవానికి చాలా దగ్గరిగా ఉంది.  ఏపీలో ఎన్టీఆర్ కి రాజకీయంగా ప్రాధాన్యత  కల్పిస్తే మాత్ర..  టీడీపీ భవిష్యత్తు లీడర్ గా నారా లోకేష్ కంటే.. ఎన్టీఆర్ నే ప్రజలు కోరుకుంటారు.  టీడీపీ ఎన్టీఆర్ చేతికొచ్చేలా జగన్ సాయం చేస్తారని కూడా  ఎన్టీఆర్ వర్గం భావిస్తోంది. మరో భవిష్యత్తులో ఏం జరుగుతుందో  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: