కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ మధ్య లుకలుకలు ఏర్పడ్డాయని భావిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు మరింత ఊతాన్నిచ్చే విధంగా ఉన్నాయి. ఓ వైపు నేతల అలకలు, మరోవైపు ప్రతిపక్ష నేతల సవాళ్లు మధ్య నలిగిపోతున్న ప్రభుత్వాన్ని గట్టెక్కించే మార్గం అన్వేషించాల్సింది పోయి ముఖ్య నేతలే ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వ మనుగడ మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

 

గొంతులో గరళం దాచుకున్న శివుడిలా నా పరిస్థితి మారిందంటూ కుమార స్వామి ఇదివరకే వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసి చర్చలకు తావిచ్చారు. ఆయన ఓ సమావేశంలో పాల్గొని మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

నా గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తున్నానో మాటల్లో చెప్పలేను. బయటి ప్రపంచానికి నేను ముఖ్యమంత్రినే కావచ్చు. కానీ ప్రతిరోజు బాధతోనే బతుకుతున్నాను. ప్రజల సమస్యలను ఎవరు తీరుస్తారు?. నా బాధ, ఆవేదన వెనక ఉండే కారణాలను నేను చెప్పుకోలేను. రాష్ట్రానికి ప్రస్తుతం నేను బాధ్యుడని. కాబట్టి ప్రభుత్వం సజావుగా సాగాలి. ప్రభుత్వం జాగ్రత్తగా నడవాలంటే అధికారుల్లో నేను ఆత్మవిశ్వాసం నింపాలి..

 

తంలోనూ కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సీఎంగా ఎన్నికైనందుకు అభింనందిస్తున్నారే గానీ గొంతులో గరళం దాచుకున్న శివుడిలా తన పరిస్థితి తయారైందంటూ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఇదే కాకుండా సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరు పార్టీల మధ్య కీచులాట ప్రతిపక్షానికి ఓ అస్త్రంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: