రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి గూటురు మురళీ కన్నబాబు మంత్రి అనిల్‌కుమార్‌పై విరుచుకుపడ్డారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బినామీగా అనిల్‌ కుమార్‌ అణిగి మణిగి ఉంటారనే కీలకమైన జలవనరుల శాఖను కట్టబెట్టారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని విమర్శించే ముందు అనిల్‌కు ఉన్న అర్హతను గుర్తెరిగి ప్రవర్తించాలని పేర్కొన్నారు.

 

రాష్ట్రమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు వీధిరౌడీని తలపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి బినామీగా.. శాఖపై ఎలాంటి అవగాహనలేని అనిల్‌కుమార్‌కు ఇరిగేషన్‌ శాఖను కట్టబెట్టారు. టీడీపీ హయాంలో నీరు-చెట్టు పనుల్లో అవినీతి జరిగిందని ఘోషిస్తున్న మంత్రి అనిల్‌ కుమార్‌కు చిత్తశుద్ధి ఉంటే జిల్లాకు చెందిన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కనుసన్నల్లో జరిగిన పనులపై ముందుగా విచారణ చేపట్టాలి అన్నారు.

 

టీడీపీ హయాంలో జరిగిన నీరు-చెట్టు పనుల్లో రూ.18వేల కోట్లు మింగేశారని మంత్రి విమర్శించడం తగదన్నారు. దోపిడీ జరిగిందని మంత్రి నమ్మినట్లయితే ముందుగా అప్పట్లో టీడీపీలో ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి కనుసన్నల్లో జరిగిన పనులపై విచారణ చేపట్టాలని సవాల్‌ విసిరారు. అవినీతిని ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్ష అనుభవించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ చండ్రా వెంకటసుబ్బానాయుడు, మండల తెలుగుయువత అధ్యక్షుడు మంతు వెంకటేశ్వర్లురెడ్డి, ఆత్మకూరు, చేజర్ల మండలాల మాజీ టీడీపీ అధ్యక్షులు దావా పెంచలరావు, గోనుగుంట రాంబాబు, టీడీపీ నేతలు రావి లక్ష్మీనరసయ్య, కొండా సుధాకర్‌ రెడ్డి, గుండాల విజయభాస్కర్‌రెడ్డి, మల్లవరపు శ్రీనివాసులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: