వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నంతసేపూ ఆయన్ని ఓ కరడు కట్టిన ఆర్ధిక నేరస్తునిగా టీడీపీ అనుకూల మీడియా ప్రతీ రోజూ చూపించేది. జగన్ మొండివాడని, ఆయనకు ఏమీ తెలియదని ఇష్టం వచ్చినట్లుగా సొంత కధనాలు వండి వార్చేది. ఇక జగన్ కి ఏం అనుభవం ఉంది జైలు అనుభవం తప్ప ఇదీ...  తెల్లారి లేస్తే చంద్రబాబునాయుడు తిట్లపురాణం..సెటైర్లు


అటువంటి జగన్ పట్టుమని ఇరవై రోజులు కూడా కాలేదు. అద్భుతమైన పాలకుడుగా జనంలో ముద్ర పడ్డారు. జగన్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం పొరుగు రాష్ట్రాలకు దడ పుట్టిస్తోంది. ఆయనకు లభిస్తున్న మద్దతు ఇతర సీఎంలకు అసూయను కలిగిస్తోంది. కోట్లాదిమంది జనాల అభిమానం పొందిన జగన్ ఇపుడు పక్క రాష్ట్రం తెలంగాణాలోనూ కేక పుట్టిస్తున్నారు.


ఉద్యోగులకు 27 శాతం ఇంటీరియం రిలీఫ్ ని ఒక్క మాటలో ప్రకటించిన జగన్ని తెలంగాణాలోని  అక్కడి ప్రభుత్వం ఉద్యోగులు తెగ పొగుడుతున్నారు. పేద రాష్ట్రం ఏపీ ఇవ్వగా లేనిది సంపన్న రాష్ట్రం తెలంగాణా ఎందుకు ఇవ్వదని అక్కడి ఉద్యోగులు కేసీయర్ ని నిగ్గదీస్తున్నారు. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమన్న డిమాండ్ అక్కడ  చాలా కాలంగా ఉంది. జగన్ దాన్నిఏపీలో  ఇలా వచ్చి అలా చేశాడు. తెలంగాణాలో కేసీయార్ పక్కన పెట్టారని ఆర్టీసీ ఉద్యోగులు గుస్సా అవుతున్నారు.


ఇక లేటెస్ట్ గా ఈ రోజు నుంచి ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ జగన్ మంజూరు చేస్తూ అమలు చేశారు. అదే తెలంగాణాలో అయితే జూన్ 2న 2014న తమ ప్రమాణం సందర్భంగా కేసీయార్ ఈ  హామీ ఇచ్చారు ఇప్పటికి అమలు చేయలేకపోయారు. దాంతో అక్కడి పోలీసులు జై జగన్ అంటున్నారు. మొత్తానికి ఒక్కో వర్గం మద్దతు ఇక్కడే కాదు అక్కడ కూడా జగన్ కి పెరుగుతోంది. ఇది ఓ విధంగా కేసీయార్ కి గుబులు పుట్టించే అంశమే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: