చంద్రబాబునాయుడు పాత తరం రాజకీయ నేత. జగన్ సీఎం కావడంతో ఇపుడు సీన్ మారింది. అంతా యూత్ వచ్చేశారు. ఏపీ అసెంబ్లీ చూస్తే అదే అర్ధమవుతుంది. అక్కడంతా చిన్న వాళ్ళే కనిపిస్తారు. ఓ విధంగా యువ సభగా ఉంటుంది. ఆ సభల్లో పెద్ద మనిషిగా ముదురు పొలిటీషియన్ గా చంద్రబాబే కనిపిస్తారు.


ఇదిలా ఉండగా అసెంబ్లీ చాంబర్ల కేటాయింపు ఇపుడు ఓ వివాదంగా మారుతోంది. చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకునిగా చిన్న చాంబర్ ఇచ్చారని తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. మా బాబుకి ఇంతటి అవమానమా అంటూ వారు ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారాం వద్దకు వెళ్ళి మరీ గోడు వినిపించుకున్నారు.


చిత్రమేంటంటే జగన్ అయిదేళ్ళ పాటు వాడిన ప్రతిపక్ష నాయకుని చాంబర్ ఇపుడు చంద్రబాబుకు కావాలట. దాన్ని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన కోన రఘుపతికి కేటాయిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరో వైపు చంద్రబాబుకు చిన్న చాంబర్ ఇచ్చారట. దాంట్లో ఎలా సర్దుకుంటామని తమ్ముళ్ళు అలుగుతున్నారు.


అయితే దీని మీద వైసీపీ వారి వాదన వేరే విధంగా ఉంది. చంద్రబాబుకు ఉన్న ఎమ్మెల్యేలు 23 మంది మాత్రెమే. జగన్ కి 2014లో 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే టీడీపీకి మూడింతలు. మరి చిన్న పార్టీకి చిన్న  చాంబర్లు  కాక పెద్ద చాంబర్లు ఎలా ఇస్తామని అంటున్నారు. మొత్తానికి దేశ ప్రధాని అని తమ్ముళ్ళు మురిసిపోయే బాబు ఇపుడు చిన్న చాంబర్ లో సర్దుకుపోవాలేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: