ఇక ఆ పత్రికలో పొలిటికల్‌ కార్టూన్లు ఉండవు!! 
తమ పత్రికలో రాజకీయ కార్టూన్ల ప్రచురణను నిలిపివేస్తున్నట్లు 'న్యూయార్క్‌ టైమ్స్‌' ప్రకటించింది.
తమ అంతర్జాతీయ ఎడిషన్‌లో కొన్ని పేజీల్లోని కార్టూన్లు జాతి విద్వేష పూరితంగా ఉంటున్నాయని, ఇటీవల ప్రచురించిన ఓ కార్టూన్‌ కూడా అదే తరహాలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పత్రికా యాజమాన్యం ప్రకటించింది.

 గత ఏప్రిల్‌ లో ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజామిన్‌ నెతాన్యూహు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై పత్రిక ప్రచురించిన రాజకీయ కార్టూన్‌ జాతి విద్వేషాన్ని ప్రతిబింబించినట్లు ఉందని ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి.

బెంజామిన్‌ అనే కుక్క మెడకు తాడువేసి ట్రంప్‌ లాగుతున్నట్లు ఆ రాజకీయ వ్యంగ్య చిత్రం ఉంది. ఈ కార్టూన్‌ తమ దష్టికి రాకుండానే ప్రచురణ అయిందని ఆ పత్రిక వివరణ కూడా ఇచ్చుకుంది. చూసినా, చూడకపోయిన ప్రచురించిన వార్తలకు, కార్టూన్లకు పత్రికా యాజమాన్యం బాధ్యత వహించాల్సిందే. 

ఇలాంటి వివాదాల మధ్య ఎందుకొచ్చిన కార్లూన్లు అని మొత్తానికి రాజకీయ కార్టూన్లనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. జాతి విద్వేషాలను రెచ్చగొట్టకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూనే ఈ తిప్స ఉండువి కాదని కొందరు మీడియా ప్రముఖులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: