జగన్మోహన్ రెడ్డికి తెలంగాణాలో కూడా మద్దతు పెరుగుతోంది. తాజగా కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి జగన్ తెలంగాణాకు వస్తే తప్పేంటని ప్రశ్నించటంతో కలకలం మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీని దారుణంగా దెబ్బకొట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ గ్రాఫ్ తెలంగాణాలో పెరిగిపోయింది. ప్రధానంగా తెలంగాణా కాంగ్రెస్ నేతల నుండి ఊహించని మద్దతు వస్తోంది.

 

ఈమధ్యనే కాంగ్రెస్ ఎంఎల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ కు తన పూర్తి మద్దతు పలికారు. యువకుడైన జగన్ కు ఏపిలో 50 శాతం ఓటర్లు మద్దతు పలకటమే చాలా గొప్ప విషయమన్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్ అమల్లోకి తెస్తుండటం చాలా మంచి పరిణామమన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అనుకోవటం నిజంగా గొప్ప విషయమని జీవన్ అన్నారు.

 

ఇపుడేమో జగ్గారెడ్డి తెలంగాణాకు రావటంలో తప్పేమీ లేదన్నారు. జగన్ కు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.  జగన్ కు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అంటే ఈమధ్య తెలంగాణా సిఎల్పీ భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ రాకూడదని చెప్పిన విషయం తెలిసిందే. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కెసియార్ ఆహ్వానిస్తే జగన్ తెలంగాణాలోకి ఎలా వస్తారంటూ భట్టి జగన్ ను ప్రశ్నించేశారు.

 

ఆ విషయంపైనే జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రారంభోత్సవాలకు, రాజకీయాలకు ముడిపెట్టటం బావోలేదన్నారు. కాబట్టి కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ రావటంలో తప్పేమీ లేదనటం విశేషం. అంతకుముందు ఇఫ్తార్ విందు సందర్భంగా రాజభవన్ కు వచ్చినపుడు జగన్ ను చూడటానికి జనాలు పోటెత్తారు. రాజభవన్ చుట్టపక్కలుండే వీధులన్నీ జగన్  జిందాబాద్ లతో మారుమోగిపోయింది.

 

మొత్తానికి ఎన్నికల్లో ఏపిలోను తర్వాత తెలంగాణాలో కూడా జగన్ తనకంటూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. తెలంగాణాలో వైసిపి ఏదో ఉన్నాను అన్నట్లుగా నెట్టుకుస్తోంది. అయినా పార్టీతో సంబంధం లేకుండా జనాలు జగన్ ను ఆధరించటం గొప్పగానే చెప్పుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: