స్వరూపానందేంద్ర స్వామి శైలిపై నిరశన స్వరాలు
విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి వ్యవహార శైలిపై నిరశన గలాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి హైందవ మతంలోనికి ఆహ్వానించటం, ముఖ్యమంత్రిని చేయటంలో కష్టపడ్డట్టు చెప్పడం కూడా వివాదాస్పదానికి తావిచ్చింది. హైందవుల్లో అనేక మంది స్వరూపానందేంద్ర స్వామి రాజకీయ ప్రమేయాన్ని తప్పుపడుతున్నారు. వారి మాటల్లోనే...

*నిన్న శారదాపీఠం* *స్వరూపానందేంద్ర స్వామి మాటలు బాధనిపిస్తోందని ఓ పరమ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత డైరెక్టుగా రాజకీయ భజనలు చేస్తుంటే, చిడతలు వాయిస్తుంటే, ఇక పీఠాలపై, పీఠాధిపతులపై భక్తి విశ్వాసాలు, గౌరవ మర్యాదలు ప్రజలలో కలుగుతాయా? ఉంటాయా?


అమ్మవారి పీఠాధిపతియై ఉండి, అమ్మవారిని హృదయంలో ప్రతిష్టించుకోకుండా.. రాజకీయ నాయకులను, అది కూడా హిందూ ధర్మాన్ని ఆచరించని వారిని హృదయంలో పెట్టుకున్నానని, వారి కోసమే పీఠం పనిచేసిందని చెప్పడం అది అందరిలో బహిర్గతం చేయడంతోనే 'శ్రీ శారదా పీఠానికి' ఉన్న పరువు ప్రతిష్టలు పోయాయి..


*స్వాముల వారి మాటలు చాలా ఎబ్బెట్టుగా, ఒక పార్టీ కార్యకర్త తన నాయకున్ని పొగిడినట్టుగా ఉంది..*
*అంతరంగంలో అభిమానం ఉంటే ఉండనీ..* దాన్ని ఇలా బహిరంగంగా ప్రదర్శించి ప్రజలలో చులకన అవ్వడం సబబుగా ఉంటుందా? అది పీఠం పరువు తీయడం కాదా? 


*తటస్థంగా ఉంటూ అందరివాళ్ళుగా అనిపించుకోవాల్సిన ఇలాంటి పీఠాధిపతులు, స్వాములు ఇలా రాజకీయాల పట్ల, రాజకీయ నాయకుల పట్ల మనసులో అనురక్తిని కలిగి ఉండటం ఆశ్చర్యం కలుగుతుంది.*


మరింత సమాచారం తెలుసుకోండి: