సాగునీటి ప్రాజెక్టుల్లో వందల కోట్ల అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలను వెలికి తీసేందుకు రివర్స్ టెండర్ పథకం తెస్తాం అంటున్నారు. నిజానికి ఇది జరిగితే రాష్ట్రానికి చాలా మంచిది.

 

అయితే... వైసీపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందా అన్నదే అసలు విషయం. ఎందుకంటే.. వైఎస్ హయాంలో జల యజ్ఞం ధన యజ్ఞం అని టీడీపీ ఎన్నో ఆరోపణలు చేసింది. కానీ చంద్ర బాబు అధికారం లోకి వచ్చాక ఏ  ఒక్కరి పైనా చర్య తీసుకోలేదు.

 

ఎందుకంటే.. జలయజ్ఞం ప్రాజెక్ట్స్ అన్నీ వేల కోట్ల రూపాయల తో కూడుకున్నవి. ఎవరు అధికారం లో ఉన్నా.. రాష్ట్రం లోని ఆ మూడు, నాలుగు కంపెనీలే ప్రాజెక్ట్స్ కడుతుంటాయి. అధికారంలో ఉన్నవారు.. ఆ కంపెనీల నుంచి ఆర్థిక సాయం పొందుతుంటారు.

 

ఇది బహిరంగ రహస్యం. కానీ జగన్ మాత్రం ఈ అక్రమాల బండారం బయట పెడతా అంటున్నాడు. మరి నిజంగా అది సాధ్యమవుతుందా? జగన్ సర్కారు ఆ పని చేస్తే చరితలో నిలిచి పోతారు. కానీ అసలు ఆ పని జరుగుతుందా? జరగాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: