రాజకీయాల్లో సెంటిమెంట్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సెంటిమెంట్ కు లాజిక్ ఉండదు. కానీ అందరూ ఫాలో అవుతారు. గుంటూరు జిల్లా విషయంలోనూ అలాంటి సెంటిమెంట్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

అదే సిక్స్ సెంటిమెంట్. ఈ జిల్లాలో అయిదు సార్లు గెలిచిన నేతలు ఆరోసారి మాత్రం ఒడిపోతున్నారు. కోడెల శివప్రసాదరావు, మాకినేని పెదరత్తయ్య, కన్నా లక్ష్మీ నారాయణ వంటి వారు ఇందుకు ఉదాహరణ.తాజాగా ఈ జాబితాలో మరో నేత చేరారు.

 

ఆయనే ధూళిపాళ్ల నరేంద్ర. ఈయన పొన్నూరు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. పొన్నూరు లో తిరుగులేని నేత గా ఎదిగారు. ఇప్పటికీ వరుసగా అయిదు సార్లు పొన్నూరు నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.

 

కానీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. టీడీపీ పక్కగా గెలిచే సీటు గా లెక్క వేసుకున్న పొన్నూరు లో నరేంద్ర 1000 ఓట్లతో ఓడిపోయారు. అందుకే నరేంద్ర ను సిక్స్ సెంటిమెంట్ ఓడించింది అని చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: