ఏపీ సీఎం జగన్ విషయంలో ఓ విచిత్రం చోటు చేసుకుంటోది. ఆయన ఇటీవలే ఏపీ కి సీఎం అయ్యారు. కానీ ఇంతవరకు ఆయన పేరు సీఎంగా ఏ శిల ఫలకం పైనా కనిపించలేదు.

 

కానీ.. ఆయన పేరు ఏపీ సీఎంగా తొలిసారి తెలంగాణ లో కనిపించబోతోంది. చిత్రం గా ఉంది కదా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి జగన్ వెళ్తున్న సంగతి తెలిసిందే.

 

కాళేశ్వరం ప్రాజెక్ట్ శిలా ఫలకంపై ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పేరు కూడా ఉందట. ఈ శిలా ఫలకంపై తెలంగాణ సీఎం కేసిఆర్ పేరుతో పాటు ముఖ్య అతిథులుగా వస్తున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్,ఏపీ సీఎం జగన్ పేర్లు కూడా చెక్కారట. అంటే ఏపీ కంటే ముందే జగన్ పేరు తెలంగాణాలో సీఎం హోదా లో ఉంటుందన్నమాట.

 

వాస్తవానికి జగన్ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా జలదీక్ష చేశారు. కానీ ప్రస్తుతం కెసీఆర్ తో ఉన్న స్నేహ సంబంధాల కారణంగా.. తెలంగాణతో సామరస్యంగా వెళ్లాలని నిర్ణయించారు. కయ్యం కంటే నెయ్యమే మంచిదని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: