అప్పట్లో ఇటువంటి కామెడీ న్యూస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ అనుకూల వర్గం చాలా ప్రయత్నం చేసింది . దీనితో అర్ధం పర్ధం లేని న్యూస్ ను జనాల్లోకి వదులుతున్నారు. జగన్ తో చిరంజేవి భేటీ అవ్వడం ఏంటి అది కూడా జగన్ నివాసం లో ... చంద్రబాబుని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని చిరంజీవి జగన్ అనుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో జనసేన వైసీపీ కలిసి పోటీ చేస్తే అధికారం కన్ ఫర్మ్ అని డిసైడ్ అయ్యారట.


పవన్ తరపున చిరంజీవి వచ్చాడని, ఇందుకు జగన్ కూడా సుముఖత వ్యక్తం చేశారని కథలు అల్లేశారు అప్పట్లో.  అయితే ఇప్పుడు మరో గాసిప్ అటువంటిదే ఒకటి బయటికి వస్తుంది. జగన్ సీఎం అయిన తరువాత అతన్ని అభినందించడానికి చిరంజీవి స్వయంగా వెళ్లి జగన్ ను తన నివాసంలో కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. 


అప్పట్లో ఎయిర్ పోర్ట్ లో జగన్ మీద దాడి జరిగినప్పుడు చిరంజీవి స్వయంగా జగన్ కు ఫోన్ చేసి పరామర్సించిన సంగతీ తెలిసిందే. రాజకీయంగా చిరంజీవి, జగన్ వేరు అయినప్పటికీ ఒకరి మీద ఒకరికి సాఫ్ట్ కార్నర్ ఉందని చెప్పాలి. మొన్న జగన్ తన ప్రమాణస్వీకారానికి చిరంజీవిని ఆహ్వానించిన సంగతీ తెలిసిందే. దీనితో జగన్ తో చిరంజీవి భేటీ అయ్యాడని వార్తలు పుట్టుకొచ్చినాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: