2018 ఎన్నికల్లో తెలంగాణాలో తెరాస పార్టీ భారీ విజయం సాధించింది.  అసలు అన్ని సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అసలు ఊహించలేదు.  అన్ని సీట్లు గెలుచుకోవడం వలన తెరాస లో ఒకవిధమైన ఆత్మవిశ్వాసం ఏర్పడింది.  ఈ ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువగా కావడంతో... పార్లమెంట్ ఎన్నికల్లో సైతం భారీ విజయం సాధిస్తామని చెప్పారు.  


17 పార్లమెంట్ స్థానాలకు గాను ఖచ్చితంగా 16 గెలుస్తామని తెరాస పార్టీ పేర్కొంది.  ఎన్నికలు ముగిశాయి.  అయితే అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది మరొకటిగా మారింది.  పార్టీ 16 స్థానాలు అనుకుంటే కేవలం 9 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది.  ఈ 9 స్థానాల్లో నిజామాబాద్ లో ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడుపడలేదు.  


నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేసింది.  గతంలో విజయం సాధించిన కవిత ఈసారి జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైంది.  దానికి కారణం లేకపోలేదు.  నిజామాబాద్ లో పసుపు బోర్డు విషయంలో రైతులకు అన్యాయం జరిగిందని చెప్పి 150 మంది రైతులు పోటీ చేశారు.  దీంతో అక్కడ కవిత ఓడిపోయిందని వార్తలు వచ్చాయి.  


దీంతో పాటు ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి ఆ నియోజక వర్గంలో తన టీమ్ చేత పనిచేయించారని, అయన వ్యూహాలే కవిత ఓటమికి ఒక కారణంగా నిలిచాయని వార్తలు అందుతున్నాయి.  అయితే, ప్రశాంత్ కిషోర్ అక్కడ ఆ స్థానం నుంచి ఎందుకు పనిచేయాల్సి వచ్చింది అన్నది తెలియాలి.  ఎవరు ప్రశాంత్ కిషోర్ ను అక్కడ వినియోగించుకున్నారో తెలియాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: