ఇపుడిదే అంశం తెలుగుదేశంపార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది.  తొందరలో ఐదుగురు రాజ్యసభ సభ్యులు చంద్రబాబునాయుడుకు బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఐదుగురు కూడా పార్టీలో చాలా కీలక నేతలే.  మరి టిడిపి తరపున ఉన్నదే ఆరుగురు రాజ్యసభ సభ్యులు. అందులో ఐదుగురు జంప్ అవ్వటానికి రంగం రెడీ అయ్యిందంటే మామూలు విషయం కాదు.

 

ప్రస్తుతం టిడిపి తరపున సీతా రామలక్ష్మి, కనకమేడల రవీంద్ర, సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్ ఉన్నారు. తెలంగాణాలో గరికపాటి రామ్మోహన్ రావు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు లేండి.  ఏపి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురిలో నలుగురు టిడిపిలో నుండి బిజెపిలోకి జంప్ అయ్యేందుకు రెడీ అయిపోయారని జగన్ మీడియా కూడా చెబుతోంది.

 

విషయం ఏమిటంటే టిడిపి రాజ్యసభ సభ్యుల్లో సిఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి, టిజి వెంకటేష్ పూర్తిగా  వ్యాపారస్తులు. వాళ్ళకు వాళ్ళ వ్యాపారాలే ముఖ్యం.  వీరిలో కూడా రమేష్, సుజనాలపై సిబిఐ, ఈడి దాడులు జరగటమే కాకుండా కేసులు కూడా చుట్టుముట్టాయి. ఈ కేసుల్లో నుండి బయటపడటానికి వీళ్ళిద్దరూ నానా అవస్తలు పడుతున్నారు.

 

ఒకవైపేమో టిడిపి భవిష్యత్తుపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబుకు వయసైపోయింది. పుత్రరత్నం నారా లోకేష్ నాయకత్వంపై ఎవరిలోను నమ్మకం లేదు. ఇక వైసిపిలోకి వెళ్ళలేరు. కేసులు తదితరాల నుండి తమను తాము రక్షించుకోవాలంటే బిజెపిలోకి వెళ్ళటం ఒక్కటే శరణ్యం.

 

పార్టీ మారే విషయంలో వీళ్ళ సంగతి పక్కనపెడితే  విజయవాడ ఎంపి కేశినేని నాని కూడా బిజెపిలో చేరిపోతారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు తనను పార్టీలోకి చేరాల్సిందిగా బిజెపి నుండి ఆహ్వానం వచ్చినట్లు స్వయంగా మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డే చెప్పారు. తనకే కాదట చాలామంది నేతలకు ఆహ్వానం వచ్చిందని జేసి చెప్పటంతో పార్టీలో కలకలం మొదలైందే. మొత్తానికి ఈ నెలాఖరు నుండి బిజెపి ఆకర్ష్ మంత్రం మొదలవ్వబోతోందట. చూద్దాం ఎవరిని ఆకర్షిస్తోంది బిజెపి.


మరింత సమాచారం తెలుసుకోండి: