రేపు (21.6.2019)న తెలంగాణ జలస్వప్నం కాళేశ్వరం ప్రారంభోత్సవం వెనుక శ్రమ జీవుల విజయం ఉంది. 

కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ పనుల్లో సగటున రోజూ పని చేసిన కూలీల సంఖ్య 60 వేలు. వీరిలో ఎక్కువ మంది ఒడిస్సా,బిహార్‌,పశ్చిమ బెంగాల్‌,ఉత్తర ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల వారున్నారు.

వీరితో పాటు అనుభవజ్నులైన సాంకేతిక సిబ్బంది, విదేశీ సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరే కాక ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, కార్మికులు, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన వారు రాత్రనక, పగలనక కష్టపడ్డారు. లైడార్‌ సర్వే, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ, జలసంఘం నుంచి అనుమతుల సాధనకు అహోరాత్రులు పని చేయడంతో పాటు, మూడు షిప్టులుగా పనులు చేశారు. పగలు కాలువలు, రాత్రుళ్లు సొరంగ మార్గాలు, పంపుహౌస్‌ల పనులను పర్యవేక్షణ, అర్ధరాత్రి వరకు సమీక్షలు..


ఇలా ఓ యుద్ధం లాగా ఇంజినీర్లందరూ సమష్టిగా కష్టించారు. తక్కువ సమయంలో ఇంత భారీ ప్రాజెక్టు పూర్తయ్యేస్థాయికి చేరుకోవడం ఓ అద్భుతం. కరవుతో అల్లాడే రైతుకు నీరందించాలన్న ప్రభుత్వ పట్టుదలతోనే ఇది సాధ్యమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: