అరకిలో మీటరు ఎత్తునుండి నీళ్లు... 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఇది. మేడిగడ్డ సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో.. కొండపోచమ్మ సాగర్‌ సముద్ర మట్టానికి 624 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.

అంటే, మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు గోదావరి జలాలను తరలించాలంటే అర కిలోమీటరుకుపైనే ఎత్తిపోయాలన్నమాట!


అందుకే 9 దశల్లో ఈ నీటిని ఎత్తిపోస్తున్నారు. మేడిగడ్డ వద్ద సముద్రమట్టం 100 మీటర్లు. ఇక్కడి కన్నెపల్లి పంప్‌హౌసలో 50 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9 మోటార్లు ఏర్పాటు చేశారు.


ఇక్కడ నీటి నిల్వ 4.47 టీఎంసీలకు చేరుకోగానే.. 21 మీటర్లు ఎత్తిపోసి అన్నారం బరాజ్‌లో పోస్తారు. అక్కడి నుండి 9 దశల్లో ఎత్తిపోతల కార్యక్రమం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: