2014 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు నగరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా రోజా గారు గెలిచారు. జగన్ కేబినేట్లో చోటు లభిస్తుందని భావించినా కుల సమీకరణల వల్ల రోజా గారికి మంత్రి పదవి ప్రస్తుతానికైతే రాలేదు. రెండున్నరేళ్ళ తర్వాత ఏర్పడే కేబినేట్లో మాత్రం రోజాకు ఖచ్చితంగా స్థానం లభిస్తుందని తెలుస్తుంది. 
 
ప్రస్తుతం రోజా గారు ఏపీఐఐసి చైర్మన్గా నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవితో పాటు మరో ముఖ్యమైన పదవి భాద్యతలను రోజా గారికి అప్పగించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన నవరత్నాలను సక్రమంగా అమలుపరిచేలా మరో పదవిని రోజాగారికి అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది. 
 
ఇప్పటికే రోజా గారు ఎమ్మెల్యేగా నగరి నియోజకవర్గానికి సేవలు అందిస్తున్నారు. ఇది కాక ఏపీఐఐసి చైర్మన్గా , జబర్దస్త్ షోకు న్యాయ నిర్ణేతగా ఉన్నారు. ఇన్ని భాద్యతలు రోజా గారి మీద ఉండటంతో అన్నిటికీ సమయం కేటాయించటం చాలా కష్టమైన విషయం. కానీ రోజా గారు రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు పడిన కష్టానికి మాత్రం ఇన్ని భాధ్యతలతో కూడిన ఫలితం వచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: