అమ్మఒడి అనే పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపే తల్లులకు ప్రతి సంవత్సరం జనవరి 26న 15,000 రుపాయలు జమ చేసేలా నవ రత్నాల్లో హామీ ఇచ్చారు. మొదట ఈ పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందరికీ అమలు చేస్తారని వార్తలు వచ్చాయి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఐతే ఏకంగా మా పాఠశాలల్లో మీ పిల్లల్ని చేర్పించి 15 వేల రుపాయలు పొందండి అని ఫ్లెక్సీల ద్వారా పబ్లిసిటీ చేసారు. 
 
కానీ ప్రస్తుత సమాచారం మేరకు ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింజేయనున్నారని తెలుస్తుంది. ప్రైవేట్ పాఠశాలలకు ఇస్తారా లేదా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఈ నిర్ణయం పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే తల్లిదండ్రులలో అసంతృప్తి వ్యక్తమయ్యేలా చేస్తుంది. 
 
వచ్చే సంవత్సరం జనవరి 26 నుండి ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి రాబోతుంది. గ్రామ వాలంటీర్ల ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రజలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ పథకం వర్తింపజేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: