ఏపీ ముఖ్యమంత్రి జగన్ మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోని కష్టాలను సవాళ్ళను ఎదుర్కొంటున్నారు.అయినప్పటికి తనదైన దూకుడు తో నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకు మరియు ప్రతిపక్ష పార్టీలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.

మాట తప్పను మడం తిప్పను అంటూ ఎన్నికలలో ప్రచారం చేసిన జగన్ ఆ మాటకు కట్టుబడి ఉన్నానని ప్రతి అంశంలో నిరూపిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు.ప్రత్యేక హోదా విషయంలో అటు చంద్రబాబు కు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజానీకానికి మరోసారి స్పష్టం చేశారు.

అలాగే ఈమధ్య జరిగిన నీతి ఆయోగ్ సదస్సులో దేశంలోని రాష్ట్ర ముఖ్యమంత్రలు అందరి ముందు మరోసారి ఏపీ ప్రత్యేక హోదా పై ప్రసంగించారు.పార్లిమెంట్ లో రాష్ట్ర ఎంపీలతో పాటు తెలంగాణ ఎంపీలను కలుపుకొని వెళ్ళి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించవలసిందిగా తమ పార్టీ ఎంపీలకు కర్తవ్య బోధ చేశారు.

ప్రస్తుతం తమ ఎంపీ లే కాకుండా తాము కూడా ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలో అదంతా చేస్తాం అని తమ వైఖరిని స్పష్టం చేశారు.జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్ర అభివృద్ది ఫణంగా పెట్టాలని చూస్తున్నారని కొందరు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.మరి ఏం జరగుతుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: