అవసరం ఉన్నప్పుడు వాడుకుని అవసరం తీరిన వెంటనే మర్చిపోయే రాజకీయ నాయకులు చాలా మందే ఉంటారు. అయితే వీరందరికీ పెద్ద గురువు ఎవరు అంటే ఖ‌చ్చితంగా మాజీ సీఎం చంద్రబాబు ఠ‌క్కున గుర్తుకు వస్తారు. అవసరానికి వాడుకొని వదిలేయడం.. ప్రతిసారి మాటమీద నిలబడకుండా యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబుకు చంద్రబాబే అనిపించుకుంటారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన‌ చంద్రబాబు... ఆ తర్వాత అవసరం వచ్చిన ప్రతిసారి నందమూరి ఫ్యామిలీని వాడుకొని వదిలేస్తారు. 2009 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు బాలయ్యను వియ్యంకుడిని చేసుకున్న బాబు.... జూనియర్ ఎన్టీఆర్‌కు చాలా మాయమాటలు చెప్పి ప్రచారం చేయించుకుని ఆ తర్వాత సైలెంట్‌గా సైడ్ చేసేశారు. 


2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు బీజేపీతో పొత్తు కోసం తెగ ఎదురుచూశారు. ఆ రెండు పార్టీల‌ను అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత ఆ ఇద్దరిని దూరం పెట్టేశారు. చివరకు 2019 ఎన్నికల నాటికి చంద్రబాబుని న‌మ్మి ఎవరు ముందుకు రాలేదు. దీంతో చరిత్రలోనే తొలిసారిగా బరిలోకి దిగిన చంద్రబాబు ఘోరాతి ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు దెబ్బతో ఎంతోమంది సీనియర్ల రాజకీయ భవిష్యత్తు ఖ‌ల్లాస్ అయింది. ఎంతో మంది రాజ‌కీయంగా ప‌త‌నం అయిపోయారు. ఎన్నికలకు చాలా మందిని తన అవసరాలకు అనుగుణంగా వాడుకున్న చంద్రబాబు వారిని నిట్టనిలువునా ముంచేయడంతో పాటు పనిచేశారు. వీరిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకటరావు ఒకరు. 


బీసీలను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాన‌ని జనాలను నమ్మించేందుకు కళా వెంకటరావును ఆ ప‌ద‌విలో నియమించినా పెత్త‌నం అంతా లోకేష్ కనుసన్నల్లోనే నడిచింది అన్నది వాస్తవం. ఒక అసమర్థ నేతగా చరిత్రలో మిగిలి పోయిన కళా వెంకటరావు ఈ ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా కనుమరుగయ్యే ప్రమాదంలో పడిపోయారు. ఇక ఇప్పుడు శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన పార్టీ యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడుకి ఏపీ టీడీపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు రంగం అంతా సిద్ధమైంది. రామ్మోహన్ నాయుడు యువకుడు కావడం, వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలవడం, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం... దివంగ‌త పార్టీ నేత కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడి కుమారుడు కావ‌డం... అన్నింటి క‌న్నా యువ‌త‌లో క్రేజ్‌తో పాటు బ‌ల‌మైన వాగ్దాటి ఆయ‌నకు ప్ల‌స్ కానున్నాయి.


ఇక రామ్మోహ‌న్‌నాయుడుకు ఈ ప‌ద‌వి ఇచ్చినా ఆయ‌నకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారా ?  లేదా ? అన్న‌ది చూడాలి. గ‌తంలో క‌ళాకు ప‌ద‌వి ఇచ్చినా లోకేష్ పెత్తం చేసేవార‌న్న విమ‌ర్శ ఉంది. ఈ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రూ ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు రామ్మోహ‌న్‌నాయుడు వాయిస్ ముందు లోకేష్ ఆగే ప‌రిస్థితి ఉండ‌దు. మ‌రి ఈ టైంలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌న అవ‌స‌రాల కోస‌మే రామ్మోహ‌న్‌నాయుడిని బాబు వాడుకుంటారా ?  లేదా ?  భ‌విష్య‌త్తులో కూడా ఆయ‌న‌కు ప్ర‌యార్టీ ఇస్తారా ? అన్న‌ది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: