జగన్ సిఎం అయినప్పటినుండి భజన మొదలుపెట్టింది మీడియా. అయితే ఈ భజన కాస్త వేరే లెవల్ కి వెళుతుంది. జగన్ కి పరోక్షంగా కీడు చేసే స్థాయిలో వుంది. ఎలా అంటే.. తాజాగా అన్ని మీడియాల్లో వచ్చిన ఓ కధనం.. జగన్ మోహన్ రెడ్డి.. అధికారులకు చాలా ఫ్రెండ్లీగా వుంటున్నారట. అంతేకాదు… వాళ్ళ అవసరాలని నిమిషాల్లో తేలుస్తున్నారట.

 

ఇప్పుడు జగన్ పై జరుగుతున్న ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రచారం ఒక వర్గంలో మేలు చేయొచ్చు గాక.. కానీ ఇదే ట్రాప్ లో జగన్ పడితే.. చాలా వర్గాల్లో నుండి ఆయన దెబ్బతినక తప్పదు. అందుకే ఇలాంటి భజన విషయంలో జగన్ కాస్త జాగ్రత్తగా వుంటే మంచింది, అని పరిశీలకుల భావన!

 

జగన్ సిఎం అయినప్పటి నుండి ఉద్యోగులు జీతాలు… సౌకర్యాలు.. అనే పాట పాడుతున్నాడు. ఇది మంచిదే. కానీ నివురుగప్పిన నిప్పులా నిరుద్యోగ సమస్య వుంది. డిగ్రీలు చేతపట్టుకొని రోజుకి వందరూపాయిలు కూడా ఆదాయం లేక విలవిలలాడుతున్న యువకులున్నారు. పదిరూపాయిల పనికి మూడు రూపాయిలు తీసుకొని కూడా పని చేయడానికి సిద్దంగా వున్నారు.

 

అంతేకాదు..రాష్ట్రంలో ఎటు చూసిన సమస్యలు వున్నాయి. ఇలాంటి నేపధ్యంలో లక్షరూపాయిలు జీతం వచ్చివాడికి మరో పది వేలు బోనస్ ఇస్తే.. వాడికి ఎలాంటి ఎమోషన్ వుండదు. కానీ చేయడానికి పని దొరక్క పొట్ట చేత పట్టుకున్న వాడికి పదిరుపాయిలు ఇచ్చినా మహా ప్రసాదంగా భావిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: