గత ప్రభుత్వాల హయాంలో కీలక పదవుల్లో ఉన్న అనేక మంది నాయకులకు ఏపీలో కొత్తగా ఏర్పాటైన వైఎస్ జగన్ ప్రభుత్వంలో చోటు దక్కలేదు. ఆ జాబితాలో మాజీమంత్రి, సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆర్థికశాఖ వంటి కీలక బాధ్యతలు నిర్వహించిన ఆనం రామనారాయణరెడ్డికి... జగన్ కేబినెట్‌లో కచ్చితంగా చోటు ఉంటుందని చాలామంది భావించారు.

 

కానీ జగన్ మాత్రం సీనియర్లను పక్కనపెడితూ కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో నెల్లూరు జిల్లా నుంచి ఆనం కంటే జూనియర్లు అయిన అనిల్ యాదవ్, గౌతమ్ రెడ్డిలకు కేబినెట్‌లో ఛాన్స్ దక్కింది. అయితే తనకు కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై ఆనం అలక వహించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

మరోవైపు జగన్ కూడా కొంతమందిని ప్రత్యేకంగా పిలిపించి బుజ్జగించారు కానీ ఆ లిస్ట్ లో ఆనం రామనారాయణ రెడ్డి పేరు లేదు. అయితే త్వరలోనే ఆనం జగన్ తో భేటీ అవుతారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

 

రెండున్నరేళ్ల తర్వాత ఆనంను మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని, అంతవరకు ఓపిక పట్టాలని ఆనంకు జగన్ సర్దిచెప్పే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి వైఎస్ హయాంలో ఓ వెలుగువెలిగిన సీనియర్లందరికీ జగన్ ఊహించని విధంగా షాక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: