తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది.  ఆ పార్టీ మరోసారి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది.  చంద్రబాబు కుటుంబంతో సహా విదేశీ పర్యటన సమయంలో...  తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు రాజకీయం మొదలైంది.

 

ఢిల్లీలో సుజనా చౌదరి నాయకత్వంలో  నలుగురు ఎంపీలు ఒక గ్రూపుగా భావించా లంటూ  రాజ్యసభ చైర్మన్ కు లేఖ   ఇస్తున్నారు.  మొత్తం ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది పిడుగుపాటు లాంటి వార్త.  ఇంకా కేవలం ఇద్దరు మాత్రమే ఆ పార్టీకి మిగిలిపోతారు.

 

ఈ సమయంలో కాకినాడలో ను కాక రాజుకుంటోంది.  తెలుగుదేశం పార్టీకి చెందిన  కాపు నాయకులు అంతా  పార్టీ అధిష్టానానికి  సమాచారం ఇవ్వకుండానే ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  వీరంతా బిజెపిలో చేరాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  తోట త్రిమూర్తులు నేతృత్వంలో కాకినాడ లోని ఓ హోటల్ లో రహస్యంగా సమావేశమయ్యారు.

 

మొత్తం మీద అక్కడ ఢిల్లీలో..  ఇక్కడ కాకినాడలో  కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.   మరి విదేశాల్లో ఉన్న  చంద్రబాబు ఇప్పుడు ఎలాంటి చర్యలు  తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: