తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. ఇది తరచూ చంద్రబాబు నాయుడు చెప్పే మాట. సవాళ్ళను ధీటుగా ఎదుర్కొంటాం. ఇది కూడా ఆయన మాటే. తెలుగుదేశం శాశ్వతం. తెలుగు జాతి ఉన్నంతవరకూ ఆ పాటీ ఉంటుంది. సైకిల్ కి ఎదురులేదు. ఎవరూ ఈ పార్టీని ఏమీ చేయలేరు. భారీ డైలాగులన్నీ నెల క్రితం వరకూ వినిపించాయి. ఇపుడు చూస్తే సంక్షోభం అంటున్నారు.


.
ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్తున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్. టీజీ వెంకటేష్. వీరు కన్-ఫర్మ్. మరి ఖరారు కానీ వారు ఇంకా ఉన్నారేమో. ఇంతకీ వీరు ఎందుకు వెళ్తున్నారు. ఎవరి డైరెక్షన్లో వెళ్తున్నారు. అంటే బాబు గారే పంపిస్తున్నారట. దగ్గరుండి మరీ బొట్టు పెట్టి బీజేపీలోకి సాగనంపుతున్నారట. ఎందుకులా అంటే చాలా కధే వుంది అంటున్నారు వైసీపీ నాయకుడు సి రామచంద్రయ్య.


ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు బాబు ఎన్నో కుట్రలు కుయుక్తులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అదే తరహాలో ఇప్పుడు తన అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆయన అంటున్నారు. అందుకే తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరాలని చంద్రబాబు వారికి పరోక్షంగా సూచించారని ఆయన ఆరోపించారు. ఇది నిజమే అనిపిస్తోంది.  లేకపోతే సుజనా చౌదరి మీద అవినీతి కేసులు ఉన్నాయి. సీఎం రమేష్ మీద కూడా కేసులు ఉన్నాయి. మరి వీళ్ళను తీసుకువెళ్ళి బీజేపీలో చేర్చుకోవడం అంటే నిజంగా షాక్ లాంటిదే.


బాబుకు ఇపుడు ఎటూ అధికారం లేదు. అయిదేళ్ల వరకూ ఆయన ఖాళీ, రాజ్యసభ ఎంపీలు ఉంటే ఎంత. లేకుంటే ఎంత. అదే వారు బీజేపీలో ఉంటే గుట్టు తెలుస్తుంది. అక్కడ ఉంటూ అక్కడ విషయాలను బాబుకు ఎప్పటికపుడు చేరవేయగలుగుతారు. ఇంకా టాలెంట్ ఉంటే బాబుకు అనుకూలం కూడా చేయగలుగుతారు. వామ్మో ఆలొచిస్తే బాబు మంచి స్కెచ్ వేశారంటున్నారు సీ రామచంద్రయ్య. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: