ఏపీలో ఆపరేషన్ కమలం మొదలైంది. టీడీపీ రాజ్యసభలను లాగడానికి బీజేపీ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది.  నలుగురు ఐదుగురు ముఖ్యనేతలు ఇప్పుడు బీజేపీలోకి చేరే అవకాశాలున్నాయని టీడీపీ అనుకూల మీడియానే చెబుతూనే ఉంది. కుల మీడియానే ఇలా ధ్రువీకరిస్తూ ఉండటంతో.. తెలుగుదేశం నుంచి ఎంపీలు ఫిరాయించడం, బీజేపీలోకి చేరడం ఖరారే అని నిర్ధారణ అవుతూ ఉంది.


ఆ జాబితాలో వినిపిస్తున్న పేర్లలో సుజనా చౌదరి, సీఎం రమేశ్ లు ముందున్నారు! వీరు మాత్రమే గాక టీజీ వెంకటేష్, గరికపాటి వంటి చంద్రబాబు భక్తుడు, రామలక్ష్మి.. వీళ్లంతా జంపింగే అని సమాచారం. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి మిగిలేది సింగిల్ సభ్యుడే అని అంటున్నారు. కొన్నినెలల కిందట రాజ్యసభకు టీడీపీ తరఫున నామినేట్ అయిన కనకమేడల రవీంద్రకుమార్ మాత్రమే మిగలవచ్చు.. మిగిలిన అంతా జంపింగే అని మీడియాలో కథనాలు వస్తున్నాయి.


అయితే ఆయన అయినా మిగులుతాడా? అనేది సందేహమే అని పరిశీలకులు అంటున్నారు. నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహనరావులు గురువారం సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని కోరనున్నారట. అంటే దాని అర్ధం టీడీపీకీ మాకు ఏం సంభందం లేదని . ఈ వ్యవహారంపై సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం అందుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: