ఏపీలో ఆపరేషన్ కమలం మొదలు కాబోతోందంటోంది బీజేపీ. టీడీపీ నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. టీడీపీకి చెందిన కొందరు ఎంపీలు, రాయలసీమ, కోస్తాకు చెందిన ముఖ్య నేతలు కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారని చెబుతోంది.

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చేలోపు రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతోందని బాంబ్ పేల్చారు ఆ పార్టీ నేత. టీడీపీకి చెందిన ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారంటున్నారు ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.

 

టీడీపీనే కాక.. కాంగ్రెస్, జనసేన నుంచి చేరికలు ఉండబోతున్నాయని చెప్పుకొచ్చారు. ఓ న్యూ స్ ఛానల్‌తో మాట్లాడిన విష్ణు.. పెద్ద బాంబే పేల్చారు. తెలుగుదేశం నేతలు వారసత్వ రాజకీయాలు, , బానిసత్వం నుంచి విముక్తి పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

 

గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీలోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి బడా నేతలు కొందరు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. రాయలసీమకు చెందిన కొన్ని పెద్ద రాజకీయ కుటుంబాలు బీజేపీలో చేరతాని చెబుతున్నారు. వీరితో పాటూ ఎంపీలు కూడా ఈ జాబితాలో ఉన్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: