తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు ఈరోజు బీజేపీలో జాయిన్ అయ్యారు.  నలుగురు ఎంపీలు ఉపరాష్ట్రపతి కలిసి రాజ్యసభలోని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు.  


దీనికి సంబంధించిన లెటర్ ను కొద్దిసేపటి క్రితమే వీరు రిలీజ్ చేశారు.  ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి.  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైన కొద్దిరోజుల్లోనే ఇలా నలుగురు ఎంపీలు పార్టీ మారడంతో టిడిపి ఖంగు తిన్నది.  ఈ నలుగురు ఎంపీల్లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం.  


మరోవైపు లోక్ సభలోని ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీనుంచి బీజీపీలో చేరే అవకాశం  కనిపిస్తోంది.  తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఎంపీల్లో రామ్మోహన్ నాయుడుకి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారు.  సో, మిగతా ఇద్దరిలో ఒకరైన కేశినేని నాని పార్టీ మారబోతున్నారని ఇప్పటికే టాక్ వచ్చింది. 

రాజ్యసభ ఎంపీలు పార్టీ మారడంతో.. లోక్ సభ ఎంపీలు కూడా రేపో మాపో పార్టీ మారబోతున్నట్టు సమాచారం.  అయితే, తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ఎంపీలను ఎందుకు బీజేపీలో చేరుతున్నారంటే.. బాబుకు సంబంధించిన పక్కా సమాచారంఈ ఎంపీల దగ్గర ఉన్నది.  గతంలో బీజేపీపై బాబు ఒంటికాలిపై ఎగరడం వలన ఈ ఎంపీలను దగ్గర చేర్చుకొని బాబుపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దమైన బీజేపీ.  


మరింత సమాచారం తెలుసుకోండి: