ఏపీలో అధికారం తెలుగుదేశం పార్టీకి వరుసగా అదిరిపోయే షాకులు తగిలాయి ఉన్నాయి. ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంఘటనలు ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేని కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే నలుగురు రాజ్యసభ సభ్యులు ఇప్పటికే పార్టీ మార్పు అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిసి లేఖ కూడా అందజేశారు.


పార్టీ మారుతున్న వారిలో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరితో పాటు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, తెలంగాణకు చెందిన గరికపాటి మోహనరావు ఉన్నారు. అయితే ఇప్పుడు వీరితోపాటు మరో అసంతృప్త ఎంపీ కూడా టీడీపీకి జెల్ల‌కొట్టేసి కాషాయం కండువా కప్పుకుంటున్నారా ? అంటే అమరావతి సర్కిల్స్ లో అవును అనే చర్చ నడుస్తోంది. ఇక పార్టీ మారుతోన్న టీజీ వెంక‌టేష్ అయితే తాను వారం క్రితమే చంద్రబాబు నాయుడుని కలిశానని, అయితే పార్టీని వీడొద్దని ఆయన చెప్పారన్నారు. అయితే ప్రజా నిర్ణయంలో పాటు, తమ ప్రాంత అభివృద్ధి మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.


పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయాక‌ ముందుగా చంద్రబాబును టార్గెట్ చేసింది విజయవాడ ఎంపీ కేశినేని నాని అని చెప్పాలి. ఐదేళ్లపాటు నానిని చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధిపత్యం చూపించేందుకు మిగిలిన వారిని రాజకీయంగా అణగదొక్కేందుకు వెనుకాడ‌డం లేదు. ఈ క్రమంలోనే కేశినేనిని బాబు, లోకేష్ కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ ఎన్నికల్లో నాని ఎంపీగా గెలిస్తే... మైలవరం నుంచి పోటీ చేసిన ఉమా ఎమ్మెల్యేగా ఓడిపోయారు.


కేశినేని నాని చేసిన విమర్శలను రాజ్యసభ సభ్యులు ఎవరు ఖండించక పోవడం గమనార్హం. ఇప్పుడు వారంతా బీజేపీలో చేరిపోగా... రేపోమాపో కేశినేని నాని కూడా పార్టీ కండువా మార్చేస్తారు అని తెలుస్తోంది. నాని ఇప్పటికే బిజెపి పెద్దలతో టచ్లో ఉన్నారు. నానిని పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి జాతీయ నాయకత్వం సైతం సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతికి దూరంగా ముక్కుసూటి తనానికి మారుపేరుగా ఉన్న నాని లాంటి వ్యక్తులు తమ పార్టీకి అవసరమని కూడా బిజెపి భావిస్తోందట. నాని కూడా టీడీపీని వీడితే ఏపీలో ఆ పార్టీలో చాలా వికెట్లు ప‌డేందుకు రంగం సిద్ధంగా ఉన్న‌ట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: