తెలంగాణ రాష్ట్రంలోని రెడ్డి వర్గం నేతలపై బీజేపీ కన్నేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కావడానికి మరెంతో సమయం పట్టకపోవచ్చని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు.  గ్రూపులు చేసి పార్టీని భ్రష్టు పట్టించారు. తెలంగాన ప్రజలకు కాంగ్రెసు పార్టీ క్షమాపణలు చెప్పాలి. నేను కరెక్ట్ గా మాట్లాడితే కాంగ్రెస్ నేతలకు జీర్ణం కావడం లేదు.

పొత్తుల తప్పులు, చంద్రబాబు ప్రచారంతోనే ఎన్నికల్లో ఓటమి.  నాయకత్వ లోపమే... కాంగ్రెస్ దుస్థితి కారణం. రాష్ట్రంలో టీఆరెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ కొలుకునేలా లేదు. మునుగోడు నియోజకవర్గ క్యాడర్ తో చర్చించకా నిర్ణయం ప్రకటిస్తా. నేను కాంగ్రెస్ పార్టీ దుస్థితిపై మాట్లాడితే... రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఫోన్స్ వచ్చాయి.


గాంధీభవన్ నేతలం కాదు.... ప్రజల మనుషులం. నాకు షోకాజ్ ఇవ్వడం హాస్యాస్పదం. ఉత్తమ్ కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నాడు. కేసీఆర్, మై హోమ్ రమేశ్వర్రావు లతో నిత్య సంబంధాలు. ఉత్తమ్ పదవి నుంచి తప్పుకుంటేనే పార్టీ బాగుపడుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: