ఆగస్టు వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీలో భయం పట్టుకుంటుంది.  తెలుగుదేశం పార్టీకి... ఆగస్టుకు చాలా లింక్ ఉన్నది. ఆగస్టుకు.. తెలుగుదేశం పార్టీకి లింక్ ఏంటి అనే దానిపై కనుక ఒక సినిమా కథను అల్లుకుంటే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీగా తయారు చేసుకోవచ్చు .  


1982 మార్చి 29 వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది.  ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.  కొంతకాలం తరువాత ఎన్టీఆర్ కు గుండె నొప్పి కారణంగా తాత్కాలిక బాధ్యతలను నాదెండ్ల భాస్కర రావుకు అప్పగించి.. అమెరికా వెళ్ళాడు.  వచ్చే సరికి నాదెండ్ల భాస్కర రావు తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకొని ముఖ్యమంత్రిగా పీఠం నుంచి దిగలేదు. 


దీంతో ఎన్టీఆర్ ఫైట్ చేసి తిరిగి తన పీఠాన్ని దక్కించుకున్నాడు.  ఇది జరిగింది ఆగష్టులోనే.  ఇది జరిగిన కొన్నాళ్ళకు అంటే 1985 లో ఆగష్టులోనే క్యాబినెట్ ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు.  ఇది జరిగింది ఆగష్టు లోనే.  1994 లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించింది.  


అదే సమయంలో ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతికి దగ్గర కావడం పార్టీలో ఆమె పెత్తనం ఎక్కువగా ఉండటంతో.. బాబు మరికొంతమంది నాయకులతో కలిసి.. తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకున్నాడు.  ఇది జరిగింది కూడా ఆగష్టులోనే.  వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఇది జరిగింది.  ఇప్పుడు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ క్లీన్ కూడా ఆగష్టు వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  


అంటే ఆగష్టు వచ్చేసరికి దాదాపుగా తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోయినా.. ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేందుకు పావులు కడుపుతున్నది.  ఇదే జరిగితే.. తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ పడినట్టే.  


మరింత సమాచారం తెలుసుకోండి: