చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్లారు.  పర్సనల్  పనులమీద అయన అమెరికా వెళ్లారు.  ఈనెల 25 వ తేదీన తిరిగి రాబోతున్నారు.  వచ్చాక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.  బాబుగారు అలా అమెరికా వెళ్ళగానే.. ఇక్కడ పరిస్థితులు  చకచకా మారిపోయాయి.  


తెలుగుదేశం పార్టీలో ఉంటామని చెప్పిన ఎంపీలు ఈరోజు మధ్యాహ్నం రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలో జాయిన్ అయ్యారు.  జాయిన్ కావడమే కాకుండా.. తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.  ఈ విషయం తెలిసిన బాబుగారు షాక్ అయ్యి ఉంటారు.  


దీనిని చూస్తుంటే.. అప్పట్లో తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లి వచ్చే సరికి పార్టీని నాదెండ్ల భాస్కర రావు ఆక్రమించుకోవడం గుర్తుకు వస్తుంది.  అయితే, ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చాక తిరిగి అధికారంలోకి వచ్చారు.  


మరి బాబు విషయంలో అలా జరుగుతుందా.. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు.  కనీసం గట్టిపోటీ ఇచ్చే విధంగా కూడా లేకపోయాడంతో బాబు ఇబ్బందులో పడిపోయారు.  ఎంపీలు మారిపోయినా.. ఎమ్మెల్యేలు ఇంకా ఎవరు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు.  మరి ఎమ్మెల్యేలనైనా బాబు కాపాడుకోగలుగుతారా లేదంటే అమెరికా నుంచి వచ్చే సరికి టిడిపి మొత్తం ఖాళీ అవుతుందా. చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: