అనంతపురం జిల్లానుంచి బీజేపీ తన జైత్ర యాత్ర మొదలు పెట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే.  ఎలాగైనా వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని చూస్తోంది.  ఇందుకోసం పావులు కదుపుతోంది.  ఇందులో భాగంగానే అనంతరపురం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యక్తులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. 

 

మొన్న జరిగిన ఎన్నికల్లో జెసి కుటుంబం ఓటమిపాలైంది.  దీంతో జెడి దివాకర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.  మరోవైపు కెఈ కుటుంబం కూడా ఈ ఎన్నికల్లో ఓటమి పాలైంది. దీంతో కెఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు.

 

అయితే, ఈ ఇద్దరు నేతలు పక్కకు తప్పుకున్నా వారి వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  రేపోమాపో ఈ రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు బీజేపీలో జాయిన్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  అయితే, ఇప్పటికిప్పుడు ఈ రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు బీజేపీలో జాయిన్ అయినంత మాత్రానా ఉపయోగం ఉంటుందా..

 

బీజేపీ రాష్ట్రంలో బలహీనంగా ఉన్నది.  సంస్థాగతంగా ఎదగాల్సి ఉన్నది.  దీనికి కనీసం సమయం పడుతుంది.  రాజకీయా సూన్యత ఉన్నప్పుడే ఇదే సాధ్యం అవుతుంది.  జగన్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు.  ఇలాంటి సమయంలో మరో పార్టీ ఎదగడం సాధ్యం అవుతుందా అన్నది చూడాలి.  అయితే, భవిష్యత్తులో టీడీపీకి ప్రత్యామ్నాయంగా బీజీపీ ఎదగడం ఖాయం అని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: