విజయనగరం జిల్లాలోని ఎక్కువ రద్దీ కలిగి ఉన్న రైల్వే గేటు ప్రాంతం పెదమానాపురం. ఇక్కడ ప్రయాణికులు నిత్యం ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఈ రైల్వే గేటు పడుతుండడంతో ఇరువైపులా కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్  నిలిచి  పోతుంది. దీంతో ప్రయాణికులు తో పాటు స్థానికులు తరచూ అవస్థలు పడాల్సి వస్తుంది. 


అత్యవసరంగా ఆసుపత్రికి వెల్లాల్సిన వాళ్ళు సైతం రైలు దాటే వరకూ వేచి ఉండాల్సిందే. అంబులెన్స్ తో పాటు రోగులు పరీక్షలకు హాజరయ్యేందుకు వచ్చే విద్యార్థులు లు గేటు తెరిచే వరకూ  గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తుంది. పెదమానాపురం గేటు సమీపంలోకి వచ్చేసరికి అమ్మో పెదమానాపురం గేటు అని భయపడేవారు చాలామంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను విజయనగరం విశాఖపట్నం తీసుకు వెళ్లాలంటే ఈ రైల్వే గేట్ వద్దకు వచ్చేసరికి కి 108 వాహనం అధిక సమయం లో ఉండవలసి వస్తుంది.


 కొన్ని సందర్భాల్లో ఈ గేటు వద్ద చికిత్స అందక చనిపోయిన వారు ఉన్నారు. రాయగడ జైపూర్ నుంచి విశాఖపట్నం లోని ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్లే వారు  ఇబ్బందులు పడాల్సి వస్తుంది . ఈ గేటు వద్ద అధిక సమయం వెచ్చించాల్సి రావడంతో సమయానికి ఆసుపత్రికి చేరుకో లేని స్థితిలో రోగులు ఉంటున్నారు. దీంతో తో రైల్వే గేటు వద్దకు కు వచ్చేసరికి  అసహనం వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: