ఎక్కడా లేని రాజకీయాలు ఏపీలోనే జరుగుతాయి. ఎక్కడాలేని చీకటి పొత్తులు ఇక్కడే ఉంటాయి. పైన కత్తులు లోపల పొత్తులు బయటకు కోపాలు, లోపల సరసాలు ఇలాంటి రాజకీయాలు తెలుగు నేలకు కొత్త కాదు. ఎన్నడూ లేనంతగా భారీ మెజారిటీతో టీడీపీని గెలిపించి అన్న ఎన్టీయార్ కి 1994లో జనం పట్టం కట్టారు. ఎనిమిది నెలల్లో అయన పడిపోతారని ఎవరైనా అనుకున్నారా..


ఏపీలో ఇపుడు కొత్త రాజకీయం రంజుగా సాగుతోంది. బాబుకు కుడి ఎడమలుగా  ఉన్న వారే ఆ పార్టీకి గుడ్ బై కొడుతున్నారు. అయితే వీరు బాబుతో సంప్రదించే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారని అంటున్నారు. బాబు కూడా వీరిని జాగ్రత్తగా బీజేపీలోకి పంపుతున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. ఇదంతా బాబు కనుసన్నల్లోనే సాగిపోతున్న వ్యవహారంగా తలపండిన రాజకీయ జీవులే కాదు. సోషల్ మీడియా పొస్టింగులు పెట్టే వారు కూడా ఇట్టే చెప్పేస్తున్నారు.


టీడీపీలో ఉంటే కేసులు, ఐటీ దాడులు, అదే బీజేపీలోకి వెళ్తే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతారు. అయిదేళ్ళ పాటు అధికారం ఉంటుంది. బాబుకు అక్కడ నుంచే బాగా సాయం చేయవచ్చు. ఇక ఏపీలో జగన్ని నిలువరించి బీజేపీకి జగన్ కి మధ్య తంపులు పెట్టే ప్రోగ్రాం ఇపుడు స్టార్ట్ కాబోతోంది. ఏపీలో ఎదగాలనుకుంటున్న బీజేపీ ఈ వాపు బలంగా కనిపించి వైసీపీని నిర్లక్ష్యం  చేస్తే  మాత్రం ఆ పార్టీ దారుణంగా మోసపోయినట్లే. ఎందుకంటే వీరంతా బాబుకు ఇష్టులు, మళ్ళీ ఎపుడు ఆయన పిలిస్తే అపుడు వచ్చే బ్యాచే ఇపుడు బీజేపీలోకి వెళ్తోంది. అంటే ఈ ఫిరాయింపు బీజేపీకి షాక్ అన్నమాట. వింతగా ఉంది కదూ మరీ..


మరింత సమాచారం తెలుసుకోండి: