ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో అర్ధంగాని పరిస్థితి. 2014 లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పవనాలు ఒక్కసారిగా మారిపోయాయి.  వైకాపా అఖండ విజయం సాధించింది.  ఈసారి ఎన్నికల్లో టిడిపి కేవలం 23 స్థానాలకు పరిమితం అయ్యింది.  


ఈ 23 మందిలో ఎంతమంది పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. వైకాపాలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలి.  అలా వస్తేనే పార్టీలోకి ఆహ్వానం ఉంటుంది.  ధైర్యం చేసి వెళ్ళాక.. తిరిగి గెలుస్తారా అంటే ఏమి చెప్పలేం.  పార్టీ అధికారంలో ఉండొచ్చు.. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ప్రజలు గుర్రుగా ఉండొచ్చు.  


ఎందుకొచ్చిన గొడవలే అని టిడిపిలోనే ఉంటె ఉపయోగం ఉండదు.  ఏమి చేయలేని పరిస్థితి ఉన్నది.  సో, వైకాపా కాకపోతే..మిగిలింది బీజేపీ.  కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. సో, కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి కావాల్సింది చేయించుకోవచ్చు. 


అలా చేయాలి అంటే ముందు బీజీపీలో జాయిన్ కావాలి.  ఎమ్మెల్యేల కంటే.. మాజీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్రంలోని ఓ ప్రముఖ సామాజిక వర్గానికి చెందిన నేతలు బీజేపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధం  అవుతున్నారు.  తెలుగుదేశం పార్టీకి ఉభాగోదావరి జిల్లాల్లో మంచి పట్టు ఉంది. 

ఇక్కడి నేతలంతా ఈరోజు కాకినాడలోని ఓ హోటల్ లో సమావేశం అయ్యారు.  పార్టీ మారే ఉద్దేశ్యంతోనే వీరంతా సమావేశం అయ్యినట్టు తెలుస్తోంది.  ఒకవేళ వీరంతా పార్టీ మారితే.. తెలుగుదేశం పార్టీకి గుండెపోటు రావడం గ్యారెంటీ.. 


మరింత సమాచారం తెలుసుకోండి: