తెలంగాణలో జరిగిన లోక్‌స‌భ ఎన్నికల ఫలితాలు సీఎం కేసీఆర్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. 16 సీట్లు కచ్చితంగా గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ కలలుకన్నారు. ఫలితాలు చూస్తే ఈ కలలు అన్ని రివర్స్ అయ్యాయి. నిజామాబాద్ నుంచి పోటీ చేసిన తన కుమార్తె కవిత... కరీంనగర్ లో పోటీ చేసిన తన కుడి భుజం వినోద్ కుమార్ ఇద్దరు బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని కెసిఆర్ క‌ల‌లు కంటే ఆ పార్టీ నుంచి ఏకంగా మహామహులైన ముగ్గురు నేతలు ఎంపీలు గెలిచారు.


తాను ఎవరినీ అయితే పట్టుబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారో... వారే గెలవటం కేసీఆర్‌కు మింగుడు పడడం లేదు. ఇక బిజెపి 4.. కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బట్టి చూస్తే టిఆర్ఎస్‌కు ప్రమాద ఘంటికలు స్టార్ట్ అయ్యాయ‌ని... అక్కడ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రత్యేకంగా నిజామాబాద్ నుంచి తన కుమార్తె క‌విత ఓడిపోవడం... బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ విజయం సాధించడం వెనక చాలా తతంగాలు నడిచాయి. కవితను ఎట్లాగైనా ఓడించాల‌ని టిఆర్ఎస్ లోని ఒక మంత్రి... ఒక ఎమ్మెల్యే తో పాటు కొందరు కీలక నేతలు సైతం తెరవెనక చాటుమాటుగా బీజేపీ అభ్యర్దికి సహకరించారన్న ప్రచారం ఉంది.


ఇక కాంగ్రెస్ సైతం తాము ఇక్క‌డ గెల‌వ‌లేమ‌ని డిసైడ్ అయ్యి ప‌రోక్షంగా ఇక్క‌డ గెలిచే పార్టీకే స‌హ‌క‌రించాల‌ని బీజేపీకి స‌పోర్ట్ చేసింద‌న్న టాక్ కూడా ఉంది. ఇక్క‌డ గ‌తంలో రెండుసార్లు ఎంపీగా గెలిచిన మ‌ధుయాష్కీ గౌడ్ ఈ ఎన్నిక‌ల్లో అస‌లే ప్ర‌చార‌మే చేయ‌లేదు. ఆయ‌న‌కు కేవ‌లం 68 వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఆయ‌న డిపాజిట్ కూడా పోగొట్టుకున్నారు. ఇక ప‌సుపు రైతులు చీల్చిన 98 వేల ఓట్లు కూడా క‌విత ఓట‌మికి కార‌ణాలే.


అయితే ఇక్క‌డ క‌విత ఓట‌మికి, జ‌గ‌న్‌కు లింక్ ఉన్న‌ట్టు తేలింది. నిజామాబాద్‌లో క‌వితను ఓడించాల‌ని బీజేపీ అధి నాయ‌క‌త్వం దృష్టి సారించింది. ఈ క్ర‌మంలోనే గ‌తంలో త‌మ గెలుపు కోసం ప‌నిచేసి... ఈ ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు ప‌నిచేస్తోన్న ప్ర‌శాంత్ కిషోర్‌ను సంప్ర‌దించింది. పీకే కేవ‌లం ఒక్క నియెజ‌క‌వ‌ర్గం కోస‌మే తాము ప‌నిచేయలేమ‌ని చెప్పేశార‌ట‌. బీజేపీలోని కీల‌క నేత‌లు ఒత్తిడి తేవ‌డంతో చివ‌ర‌కు ప్ర‌శాంత్ కిషోర్ ఐ ప్యాక్ సిబ్బంది నుండి 20 మందిని నిజామాబాద్‌లో బీజేపీ అభ్య‌ర్ది గెలుపు కోసం కేటాయించారు. 


ఈ ఐ ప్యాక్ సిబ్బంది టీం నిజామాబాద్ లో కవిత అనుకూలతలు, ప్రతికూలతలు... బీజేపీ అభ్యర్థి అరవింద్ అనుకూలతలు, ప్రతికూలతలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి కవితకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారందరినీ బిజెపి వైపు మళ్లించే చేయడంలో తమ పాత్ర పోషించాయి. ఇవన్నీ అరవింద్ గెలుపులో కీల‌కం అయ్యాయి. మరి ఈ విషయం కెసిఆర్‌కి తెలిస్తే ఏమవుతుందో ? అన్న చర్చలు కూడా ఇప్పుడు నడుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: