గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి పాలవుతూ వస్తున్నది.  2014లో కాంగ్రెస్ ఓటమికి బీజం పడింది.  2019 వరకు అది అలా కంటిన్యూ అవుతున్నది.  తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది.  2014లో ఒక్కసీటును కూడా గెలుచుకోలేకపోయినా ఈ పార్టీ 2019 లోను అదే తీరును ప్రదర్శించింది. 

 

2014లో పర్వాలేదనిపించిన కాంగ్రెస్ 2019 లో దారుణంగా పడిపోయింది.  కేవలం 19 సీట్లతోనే సరిపెట్టుకుంది.  ఇందులో 12 మంది పార్టీ మారడంతో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది.  ఇలా రెండు రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి కొన్ని కారణాలు చెప్తున్నారు.  గాంధీ భవన్ కు వాస్తు దోషం ఉందని, వాస్తు నిపుణులు చెప్తున్నారట. 

 

గతంలో వైఎస్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు గాంధీ భవన్ లో కొన్ని మార్పులు చేయించారు.  దీంతో పార్టీ 2004, 2009 లో విజయం సాధించింది.  వైఎస్ మరణం తరువాత, పీసీసీ చీఫ్ గా ఉన్న బొత్స సత్యన్నారాయణ గాంధీ భవన్ ఆవరణలో ఇందిరా భవన్ ను నిర్మించారు.  ఈ భవనంలో వాస్తు దోషాలు ఉన్నాయట. 

 

దీనివలనే 2014లో, 2019లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని అంటున్నారు వాస్తు నిపుణులు.  ఇందిరా భవన్ లో మార్పులు చేపడితే.. పార్టీ తిరిగి కోలుకుంటుందని లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు.  ప్రస్తుతం ఇందిరా భవన్ ఏపి కాంగ్రెస్ అధీనంలో ఉన్నది.  ఈ భవన్ లో మార్పులు చేయాలి అంటే ఏపీ కాంగ్రెస్ ఆ భవన్ ను ఖాళీ చేయాలి.  మరి వాలు ఖాళీ చేస్తారా .. చేయరా..?


మరింత సమాచారం తెలుసుకోండి: