పులి కడుపున పులి పుడుతుంది అనడానికి జగన్ ఒక నిదర్శనం.  ఏదైనా సరే ఒక ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండటం.. దానికోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్దపడటం వంటివి జగన్ లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి.  ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్ ప్రత్యేక హోదా పై కేంద్రంతో పోరాటం చేయడం మొదలుపెట్టాడు. 

 

నీతి అయోగ్ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న సమయాల గురించి మాట్లాడుతూనే జగన్... ఏపీ ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడారు.  ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రం యొక్క స్థితిగతులను గురించి వివరించారు.  ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పకనే చెప్పారు. 

 

నీతి అయోగ్ సమావేశంలో మాట్లాడిన తరువాత నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా జగన్ ఇదే విషయంపై మాట్లాడారు.  ఒకేదేశం.. ఒకే ఎన్నికలు, మహాత్మాగాంధీ 150 వ జయంతోత్సవాలు వంటి వాటిపై అఖిలపక్ష సమావేశంలో చర్చించేందుకు అన్ని పార్టీలను ఆహ్వానించగా.. వాటిపై మాట్లాడుతూనే...

 

జగన్.. తనదైన శైలిలో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు.  ప్రత్యేక హోదా లేకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు.  అన్ని పార్టీలు హాజరైన ఈ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే సరికి మోడీ షాక్ అయ్యారు.  పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే.. ప్రజల్లో పార్లమెంట్ పై నమ్మకం పోతుందని ఈసారైనా మాటను నిలుపుకోవాలని ప్రత్యేక హోదాపై తగిన నిర్ణయం తీసుకోవాలని మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: