ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో.. ఏమౌతుందో చెప్పడం చాలా కష్టం. ఎవరూ ఊహించని సంఘటనలు జరిగినపుడు దానిని మిరాకిల్ అంటారు. ఇలాంటి మిరాకిల్ ను బీజేపీ రాష్ట్రంలో సృష్టించింది.  గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటుకుడా ఈ పార్టీ గెలుచుకోలేకపోయింది.   


2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకొని గెలిచిన బీజేపీ, ఈసారి ఎన్నికల్లో బోణి చేయలేదు.  ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా.. చతురంగపాణి విద్యలో ఆరితేరిన ఉద్దండుల సహకారంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించగలిగింది.  


బీజేపీ అధిష్ఠానం ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ పై కన్నేసింది.  మొన్నటివరకు కాలం కలిసిరాలేదు.  ఇప్పుడు అన్ని అనుకూలంగా మారాయి.  తెలుగుదేశం పార్టీ బలహీన పడింది.  దీనిని అదునుగా భాగించిన పార్టీ, టిడిపి నాయకులను తమవైపు తిప్పుకుంటోంది.  


ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.  లోక్ సభ నుంచి కేశినేని కూడా త్వరలోనే జాయిన్ కాబోతున్నారు.  రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు కూడా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలా ఎన్నికల్లో గెలవకపోయినా.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ఈ ప్రకంపనల దెబ్బకు పాపం టిడిపి నాయకులు విలవిలలాడిపోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: